Verse 1
గగనాన ఓ తార కనిపించె జ్ఞానులకు
యేసు పుట్టుకను ప్రకటించుచు - 2
దివ్య మహిమతో జన్మించె రారాజు
మన హృదయాలు వెలిగించ ఈ రోజు - 2 || గగనాన ||
Verse 2
సర్వోన్నతుడైన దేవునికి మహిమ
భువిపై మనకు సమాధానము - 2
అని ప్రకటించిరి దూత గణములు
ప్రవచన వాక్కు నెరవేర్పుగా - 2 ||గగనాన ||
Verse 3
మానవుల యెడల మన తండ్రి ప్రేమ
నెరవేర్చుటకై భువికేతెంచెన్ - 2
దేవదేవునికి ఏకైక కొమరునిగా
తండ్రి చిత్తమును జరిగించగా - 2 ||గగనాన ||