Verse 1
ప్రశస్తరాజ నీదు మహిమపాడనా - 2
ప్రణుతింతు నీ నామమును
ప్రకటింతు నీ వాక్యమును
ప్రభువా నీ సాక్షిగ జీవించనా - 2
Verse 2
పరిమళ సువాసనగా నే విలసిల్లాలని
అర్పణబలిగా సిలువలో మౌనివైతివా
ప్రేమ భావనా మాకిల నేర్పించి - 2
పరమేగినావా నా యేసయ్యా......... నా యేసయ్యా ||ప్రశస్త ||
Verse 3
ఈలోకయాత్ర ముగిసినవేళ
నీతో కలకాలం జీవించాలని
ఎవరు పాడని నూతన గీతం పాడాలని
ఆశించె నా మనస్సు నా యేసయ్యా..... నా యేసయ్యా ||ప్రశస్త ||