Verse 1
శ్రీమంతుడైన శ్రీయేసు దేవుని మహిమను వివరించగలనా
మరియొకరితో పోల్చగలనా
Verse 2
జ్ఞానముచేత ఆకాశమును భూమిని సృష్టించి నాడు
పగటికి సూర్యుని రాత్రికి చంద్రుని తారలని నియమించినాడు - 2
వెలుగును ధరింపజేశాడు ||శ్రీమంతుడైన ||
Verse 3
సంద్రము చీల్చి ఆరిన నేలపై తనప్రజలను నడిపినాడు
బాహువు చాపి రాజులకూల్చి అద్భుతములు చేసినాడు - 2
కానానుకు చేర్చినాడు ||శ్రీమంతుడైన ||
Verse 4
మరణము నుండి నాప్రాణమును ప్రేమతో తప్పించినాడు
శ్రమలోనున్న నా దుఃఖమును కృపతో తొలగించినాడు - 2
క్షేమము కలిగించినాడు ||శ్రీమంతుడైన ||