Verse 1
అంధకారమగు ఈ లోకములో - అంధుడనై పడియున్న నన్ను
నీ చెంతకు నను చేరదీసితివి - నాకు కనుదృష్టి నొసగిన దేవా
Verse 2
జిగటగల ఊబిలో పడియున్న - నన్ను చూచితివి
నీ రక్షణ హస్తముచే నన్ను లేవనెత్తితివి
నా పాపములన్నియును నీవు సిలువలో భరియించితివి
నా దోషములన్నియును నీవు కలువరిలో మోసితివి ||అంధకార ||
Verse 3
కడు ఘోరమగుబాధ నీ విలలో పొందితివి నాకై
నీదు రక్తము నా కొరకై చిందించినావు ఇలలో
నీ సిలువ నెత్తుకొని నేను వెంబడించెదను నిన్ను
నీదు సువార్త ఈ లోకములో ప్రకటించెదను నేను ||అంధకార ||