Verse 1
సౌవార్తికుడా ఓ సౌవార్తికుడా
ప్రభుతోడులో అడవి దారిలో
పయనించు ఓ బహు ధన్యుడా || సౌవార్తికుడా ||
Verse 2
యెరికో నగరు కూల్చిన వీరుడా - ఈ హాయి గ్రామాన పడిపోతివా
శాపాత్ముడైన ఆకాన్నుజంపి - పరిపూర్ణతలోనికి పయనించుమా ||సౌవార్తి ||
Verse 3
బయలే యెజెబేలై నిన్ బెదిరించగా - భీతిల్లి బదరాల నిదురింతువా
లేలెమ్మయా ఓ ఏలియా - బలశాలివై గొప్పపని చేయుమా ||సౌవార్తి ||
Verse 4
తిబెరయ తీరాన తిరుగాడుచూ - భృతికోసమై స్వంత వలవేతువా
ఆత్మల సంపాదించేదెవరు - సంతాపపడి సాక్షివై నిలువుమా ||సౌవార్తి ||
Verse 5
అవమానమవరోధమార్ధికలేమి - శోధించి బాధించి వేధించగా
అలుపాయెనా నిరాశాయెనా - గెలిపించు ప్రభుజూచి విజయించుమా ||సౌవార్తి ||
Verse 6
పానార్పణము చేయబడు పౌలుగా - బహుమతి పోరాటమును పోరుమా
ప్రభువచ్చును పరీక్షించును - నిత్యంబు నిలచేటి పనిజూపుమా ||సౌవార్తి ||