Verse 1
యేసయ్యా నీ ప్రేమ మధురం - అతి మధురం మధురాతి మధురం
యేసయ్యా నీ సేవ మధురం - అతి మధురం మధురాతి మధురం
వెల లేనిది ఎంచలేనిది - నా బ్రతుకే మార్చినది నా తోడుగా ఉండునది - 2
Verse 2
కష్టనష్టములలో బాధలలో - పొంగే కన్నీటిలోయలలో
అంధకార బంధము నుండి విడిపించి నన్ను బలపరచుము
నా చేయి విడువక నడిపించినా రక్షకా.... దైవమా....
రక్షకా దైవమా నీ చిత్తము నెరవేర్చుమయ్యా ||యేసయ్యా ||
Verse 3
జీవిత మంతయు నీ కృపలో జీవించ నన్ను బలపరచుము - 2
పరిశుద్ధమైన నీ ప్రేమలో పరిపూర్ణునిగా నను చేయుము
నా పాపమంతయు తొలగించినా రక్షకా... దైవమా
రక్షకా దైవమా నీ చిత్తము నేరవేర్చుమయ్యా ||యేసయ్యా ||