Verse 1
నీ.... ప్రేమ శాశ్వతము
నీ.... కరుణ శాశ్వతము
నీ.... రక్షణ శాశ్వతము
నీ రాకడ నా నిరీక్షణకాధారము
Verse 2
మాట ఇచ్చి నెరవేర్చు వాడవు
మరణభయమును తొలగించువాడవు
మహికి రక్షణ నందించువాడవు
మంటి బ్రతుకును వెలిగించువాడవు
నీదు ప్రేమ అపారము - నీ కృప నా జీవిత వరము
నిరతము పాడినా - తీర్చలేము నీ ఋణము ||నీ ||
Verse 3
ఆత్మ ఫలములు ఫలియింప జేతువు
అమర పురమును దర్శింప నిత్తువు
అఘములన్నియు హరింప జేతువు
అధిక కృపలకు అర్హులను జేతువు
నీదు ప్రేమ అపారము - నీ కృప నా జీవిత వరము
నిరతము పాడినా - తీర్చలేము నీ ఋణము ||నీ ||