Verse 1
ప్రేమకు ప్రతి రూపమైనది - నీ త్యాగము నీ యాగము
దీవెనకు కారణమైనదీ నీ యజ్ఞము బలిదానము
సహన మూర్తివై నిలువెల్ల హింసల నోర్చితివి
నా కోసమై కలువరిలో ప్రాణము విడిచితివి
మితిలేదా యాతనకు నా రాజా! యేసయ్యా
పరిమితిలేదా నీ శ్రమలకు నా తండ్రీ! కరుణామయా ||ప్రేమకు||
Verse 2
నా....దోషమే - నా.... పాపమే
నా...ద్రోహమే - నా.... నేరమే
నా దోషమే నా పాపమే - నా ద్రోహమే - నా నేరమే
నిన్ను శిలువకు నెట్టింది - మేకులతో బంధించింది ||మితి|| ||2 ||
Verse 3
నా... శాపమే - నా.... ద్వేషమే
నా... క్రోధమే - నా... స్వార్థమే
నా శాపమే నా ద్వేషమే నా క్రోధమే నా స్వార్థమే
నిన్ను పాపముగా మార్చి - వధగొఱ్ఱెలా నిలిపింది ||మితి ||
Verse 4
నా... మోహమే - నా... మోసమే
నా... గర్వమే - నా... లోభమే
నా మోహమే నా మోసమే నా గర్వమే నా లోభమే
నిన్ను తులువల మధ్యలో - దోషిగా నిలబెట్టింది
పునరుత్థాన గీతములు