Verse 1
విలువైనదీ జీవితం - వికసించు నా యేసులో
విన్నావా ఆ యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్
Verse 2
ప్రతి పాపిని రక్షింప ప్రభుయేసునే - ప్రేమించి పంపించె పరమున తండ్రి
పాపము బాపును యేసు శాపము తీయును క్రీస్తు
పదిలముగా ప్రభుసన్నిధి చేరగరావా ||విలువైనది ||
Verse 3
యేసే మార్గము సత్యము జీవంబును
యేసుని నమ్మినవారికి ఆ మోక్షము
ఆ మాటనే నమ్ము ఈ మార్గమున రమ్ము
ఈనాడే ప్రభుసన్నిధి చేరగరావా ||విలువైనది ||
Verse 4
ఏ బేధములేదు ఎవరైనను - యేసుని చేరగకోరి ఎప్పుడైనను,
యేతెంచిన అదిచాలు ఎదలో నమ్ముటమేలు
యోచించి ప్రభుసన్నిధి చేరగరావా ||విలువైనది ||