Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Baala Yaesuni Joodarae Karunaala Vaalani

బాల యేసుని జూడరే కరు ణాల వాలని

Baala Yaesuni Joodarae Karunaala Vaalani

Lyricist: Chetti Bhanumurthy
Chorus
బాల యేసుని జూడరే కరు ణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి
దేవుడు కొమరుడై జన్మించెనే‖ బాల ‖
Verse
దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు
జూచి స్తోత్రగీతముల్ పాడరే‖ బాల ‖
Verse
గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు
రక్షణంబని యంతటను చాటించరే‖ బాల ‖
Verse
జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు
మానవుండై బుట్టెను‖ బాల ‖
Verse
భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు
ప్రభు మన మధ్యనే జన్మించెను‖ బాల ‖
Verse
లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు
శ్రీ లొసంగగ వచ్చెను‖ బాల ‖

Related Tags

WorshipChristmasNativity