Verse
బాల యేసుని జన్మ దినం
వేడుకైన శుభ దినము
సేవింప రారే జనులారా
ముద్దుల బాలకు ముద్దులిడ‖ బాల ‖
Verse
మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని
చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని‖ 2x ‖
చేకొని లాలింప రారే
జో జోల పాటలు పాడి‖ బాల ‖
Verse
పాపికి పరమ మార్గము జూప
ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు‖ 2x ‖
పశుశాలయందు పవళించే
తమ ప్రేమను జూపింప మనకు‖ బాల ‖
Verse
మన జోల పాటలు ఆలించు బాలుడు
దేవాది దేవుని తనయుడు గనుక‖ 2x ‖
వరముల నొసగి మనకు
దేవుని ప్రియులుగా జేయు‖ బాల ‖