Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Baalakaa Nee Varthanamu Gaa Paadukoni Ja

బాలకా నీ వర్తనము గా పాడుకొని జ

Baalakaa Nee Varthanamu Gaa Paadukoni Ja

Lyricist: Dasari Moses
Verse
బాలకా నీ వర్తనము గా పాడుకొని జీవింపరా మేలులుకుఁ బలు కీడు
లకునదె మూలమనిగమనింపరా‖ బాలకా ‖
Verse
తప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు యానతి తప్పిపోయిన సుతుఁడు
పడిన తిప్పలు నీ వెఱుఁగవా?‖ బాలకా ‖
Verse
గోలచేయుచుఁ బెద్దలనుగని మేలమాడుట తగదురా బాలురా యెలిషాను
నవ్వి ప్రాణగొడ్డమునొందరే‖ బాలకా ‖
Verse
పరులకెగ్గొనరింపఁబోకుము దొరలునదినీ మీఁదనే పరునికై హామాను
నిల్పిన కొఱఁత నతఁడే వ్రేలఁడే‖ బాలకా ‖
Verse
కట్టఁడి కార్యంబుతుదకుఁ బట్టి కుడుపకపోదురా మిట్టిపడిన రాణి
యెజెబె లెట్టులీల్గెనొ తెలియదా?‖ బాలకా ‖
Verse
వగవకుము పరధనముఁగనియది తెగులులేని బాధరా సుగతిగనెనె
యాహబుతా శునకముల కాహారమై?‖ బాలకా ‖
Verse
ఆనృతంబులాడకుము దే హాంతమైన నేమిరా? ఆనృతము చేనని యాతన
యాలితో సహకూలఁడే‖ బాలకా ‖
Verse
కోపమునకాన్పదమునీయఁ గోరకుము మదినెన్నడు కోప జ్వాలలు
పెంచికయ్యిను గోడు చెందడె హంతయై‖ బాలకా ‖
Verse
తులువల జత గూడిమాడి చెలిమిచేయుట తగదురా పలువల
సాంగత్యమున రెహ బాము భంగము నొందఁడే‖ బాలకా ‖
Verse
బాలుడా నీ తరుణ హృదయము ప్రభున కప్పగింపరా శీల సౌష్ఠవ
మొదవునీ కా శీస్సులను జేకూరురా‖ బాలకా ‖

Related Tags

WisdomChildren