Chorus
బాలకుల విన్నపము లాలించు రక్షకా పాలనంబు సేయుమా పరమ
పోషకా‖ పోషకా ‖
Verse
బాలలారా రండియంచు బిలిచిన యేసూ చాలనమ్మి జేరితిమి సరగ
బ్రోవుమా‖ బ్రోవుమా ‖
Verse
మందబుద్ధి చేత నిన్ను మరచి యుంటిమి సుందరాప్త నీదయ మా
యందు జూపుమా‖ యందు జూపుమా ‖
Verse
చదువు వేదవాక్య సరణి నడువ నేర్పుమీ మదిని బోధకుల సుబోధ
మరువనీకుమీ‖ మరువనీకుమీ ‖
Verse
ప్రకటితమగు నీదు ప్రేమ యనుభవించుచు ఇకను నిన్ను సేవ జేతు
మఖిలకాలము‖ మఖిలకాలము ‖
Verse
పుడమి నీదు సిలువ కృపను పుణ్యలగుచును కడను నీదు మహిమ
జేర గరుణజూపుము‖ జేర గరుణజూపుము ‖