Verse 1
ఎంత ఆశ్చర్యకరుడో యన్నా - ఎంచలేము మా యేసన్నను
ఎంత పాపినైన యేసన్నా - వింతగాను రక్షించునన్నా
ఎంత అంధకారమైనను - ఎన్ని బంధకములైనను
అన్ని సరిచేయును యేసన్నా -2
Verse 2
కుంటివారికి కాలుచేతులు - కన్నులులేని కబోదులైనను
మన్ననతో నిలమంచిగా చేసిన - మంచి ప్రభుడు యేసన్నా ||ఎంత ||
Verse 3
ఆకలి గొన్నవారికి అన్నము - పేదల బీదల బాధలు తీర్చెడి
స్వర్గమునకు ఒక మార్గము చూపిన - సజ్జనుడు యేసన్నా ||ఎంత ||
Verse 4
నాయఘములకై నీచునివలెను - సిలువను పొంది చావుని గెలచి
నాకును నా దేవునికిని మధ్య - మధ్య వర్తి యేసన్నా ||ఎంత ||
Verse 5
అట్టి శ్రమలు పొంది లేచిన - ఆ క్రీస్తుని నమ్మిన యెడల
నిశ్ఛయముగ నీకు రక్షణ నిచ్చును - రక్షకుడు యేసన్నా ||ఎంత ||
Verse 6
తరలి వచ్చును ధరణికి యేసు - తండ్రి ప్రజలను సమకూర్చును
తన రాజ్యమునకు తరలించును - తండ్రి యగు యేసన్నా ||ఎంత ||