Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Baethlehaem Puramuna Chithrmbu Kalige

బేత్లెహేం పురమున చిత్రంబు కలిగె

Baethlehaem Puramuna Chithrmbu Kalige

Verse
బేత్లెహేం పురమున - చిత్రంబు కలిగె‖ పల్లవి ‖
కర్తాధి యేసు - జన్మించినపుడు
అంధకారంపు - పృథివి వీధులలో
మోదంపు మహిమ - చోద్యంబుగనరే
Verse
ఉదయంపు తారల్ - ముదమున బాడె
ఉదయించ యేసు - ఈ పృథివిలోన
ముదమును గలిగె - మరి సమాధానం
పదిలంబుతోడ - పూజించ రండి
Verse
పరమును విడచి - నరరూపమెత్తి
అరుదెంచె యేసు - పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ - తొలగించివేసి
పరలోక శాంతి - స్థిరపరచె ప్రభువు
Verse
నీదు చిత్తమును - నాదు హృదయమున
ముదమున జేయ - మదినెంతో యాశ
నీదు పాలనము - పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగజూడ
Verse
దేవుని సన్నిధి - దీనత నుండ
పావనయాత్మ - పవిత్ర పరచున్
పావను డేసు - ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి - జీవించు నెదలో
Verse
గతించె రాత్రి - ప్రకాశించె కాంతి
వితానముగ - వికసించె నెల్ల
దూతల ధ్వనితో - పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ - అరుదెంచె నోహో

Related Tags

WorshipChristmasNativity