Verse 1
సిలువ రుధిరం నా క్రయధనం - అమూల్యమైనది
కలువరి ప్రేమ కలలోనైనా - మరువ జాలనిది || సిలువ ||
Verse 2
సిలువయే నా ప్రియుని ఉన్నత ప్రేమ సంకేతము
సిలువలోనే జరిగెను నా పాప పరిహారము
విలువేలేని జీవితానికి - విలువ చేకూర్చె నీ సిలువే ||సిలువ ||
Verse 3
సిలువ విజయం సాతానునికి ఘోర అపజయము
సిలువయందె విరచె ప్రభువు మరణపు ముల్లును
పునరుత్థానుడై ప్రభువగు యేసు మరణ భయమును తొలగించెను ||సిలువ ||
Verse 4
సిలువ వార్త దేవుని శక్తియై నన్ను బలపరచెను
నశించిపోయే వారికి అది వెఱ్ఱితనమాయెను
సిలువ యందు అతిశయింతును - సిలువనే భరించెదను ||సిలువ ||
Verse 5
సిలువలోనే చూచితి సింహాసనా దర్శనం
సిలువ నీడలో సాగిపోయి చేరెద సీయోనుకు
సర్వశక్తుని సన్నిధిలో సదాపాడెద నూతన గీతమును ||సిలువ ||