Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Balamainavaadaa Balaparchuvaadaa

బలమైనవాడా బలపర్చువాడా

Balamainavaadaa Balaparchuvaadaa

Verse
బలమైనవాడా బలపర్చువాడా
మరలా నన్ను దర్శించుమా
స్తోత్రం స్తోత్రం‖ 2x ‖
స్తోత్రం నీకేనయ్యా
హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
హల్లెలూయా నీకేనయ్యా‖ బలమైన ‖
Verse
ఎండిపోతిని దిగజారిపోతిని
నీ కొరకే నేను బ్రతకాలని
మరలా నన్ను దర్శించుము‖ 2x ‖
మొదటి ప్రేమ మొదటి పవిత్రత
మరలా నాలోన దయచేయుమా‖ 2x బలమైన ‖
Verse
అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని
నీలోన నేను ఉండాలని
మరలా నన్ను వెలిగించుము‖ 2x ‖
మొదటి తీవ్రత మొదటి శక్తి
సర్వదా నాపై కురిపించుమా‖ 2x బలమైన ‖

Related Tags

WorshipPrayerRevival