Verse
బలపరచుము స్థిరపరచుము
నా ప్రార్థనకు బదులీయము‖ 2x ‖
లోకాశల వైపు చూడకూండా
లోకస్థులకు జడవకుండా‖ 2x ‖
నీ కృపలో నేను జీవించుటకు‖ బలపరచుము ‖
Verse
నా మాటలలో నా పాటలలో
నీ సువార్తను ప్రకటించెదను‖ 2x ‖
నే నడచు దారి ఇరుకైననూ
నే నిలుచు చోటు లోతైననూ‖ 2x ‖
నే జడవక నిను కొలుతును‖ బలపరచుము ‖
Verse
ధ్యానింతును కీర్తింతును
నీ వాక్యమును అను నిత్యము‖ 2x ‖
అపవాది నన్ను శోధించినా
శ్రమలన్ని నాపై సంధించినా‖ 2x ‖
నే జడవక నిను కొలుతును‖ బలపరచుము ‖