Chorus
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధనకు బదులీయుమూ‖ 2x ‖
లోకాశలవైపు చూడకుండా లోకస్థులకు జడవకుండా‖ 2x ‖
నీ కృపలో నేను జీవించుటకూ
Verse
నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను‖ 2x ‖
నే నడచు దారి ఇరుకైననూ నే నిలుచు చోటు లోతైననూ‖ 2x ‖
నే జడవక నిను కొలుతునూ
Verse
ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యమూ‖ 2x ‖
అపవాది నన్ను శోధించినా శ్రమలన్నీ నాపై సంధించినా‖ 2x ‖
నే జడవక నిను కొలుతునూ