Chorus
బలపరచుము,స్థిరపరచుము నాప్రార్థనల బదులియ్యుము
లోకాశల వైపు చూడకుండా - లోకస్తులకు జెడవకుండ
నీ కృపలో నేను జీవించుటకు‖ బలపరచుము ‖
Verse
నా మాటలలో నా పాటలలో,
నీ సువార్తను ప్రకటించెదను‖ 2x ‖
నే నడచు దారి, ఇరుకైనను నే నిలచు చోటు లోలైనను
నే జడవక నిను కొలుతును‖ బలపరచుము ‖
Verse
ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము
అపవాధి నన్ను శోధించిన శ్రమలన్ని నా పై సంధించినా
నే జడవక నిను కొలుతును
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధిన బదులియ్యుము