Verse
భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాలు చూచినపుడు‖ 2x ‖
భయము చెందకు నీవు జయము దయచేయువాడు‖ 2x ‖
దేవుడేహొవా ఉన్నాడు మన సాయంనకు దేవుడేసయ్యా ఉన్నాడు‖ 2x ‖
Verse
బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున‖ 2x ‖
పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే‖ 2x ‖
నాల్గవవాడిగ ఉండలేదా మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా‖ 2x ‖
Verse
చెరసాలలో వేసినా తమ దేహమంత గాయలతో నిండిన‖ 2x ‖
పాడి కీర్తించి పౌలు సీలల్ కొనియాడె‖ 2x ‖
భూకంపం కలగలేదా ఓ భక్తుడా భూకంపం కలగలేదా‖ 2x ‖
Verse
ఆస్తియంతా పోయినా తన దేహమంతా కుర్పులతో నిండిన‖ 2x ‖
అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకు పోయే‖ 2x ‖
అని యోబు పల్కలేదా ఓ భక్తుడా అని యోబు పల్కలేదా‖ 2x ‖