Verse 1
వెదకని నాకు దొరికితివి - నను రక్షింపను వచ్చితివి
యేసు నను కరుణించితివి - 2
Verse 2
ఎంతగానో నను ప్రేమించి - ఈ లోకమునకు అరుదెంచి
దాసుని రూపము ధరియించి - నా పాపములను భరియించి ||వెదకని ||
Verse 3
నాకై ప్రాణము బెట్టితివి - మధ్య గోడ పడగొట్టితివి
నీ మందిరముగా కట్టితివి - నీ కొమరునిగా నిలబెట్టితివి ||వెదకని ||
Verse 4
నీ మార్గంబును తొలగితినీ - నిన్నెరుగకయె మెలగితిని
కన్నులు గానక తిరిగితినీ - మంటిని నేనని మరచితినీ ||వెదకని ||