Verse 1
దినమునకు ముమ్మారు దానియేలు ప్రార్థించే
నేను కూడ దినదినము పసిమనసున వేడెదన్
యేసు యేసు - యేసు యేసు
యేసు యేసు - నా రక్షక యేసు || దినమునకు ||
Verse 2
సొలోమోను జ్ఞానముకై ప్రార్థించగా
జ్ఞానము, సంపదను అనుగ్రహించావు
యోసేపు నీతితో జీవించగా
పాపానికి దూరంగా తప్పించావు ||యేసు యేసు ||
Verse 3
దావీదు కీర్తనలతో కీర్తింపగా
ఇశ్రాయేలు రాజ్యమిచ్చి ఘనపరచావు
లోకాశలను యోబు త్యజియించగా
రెండంతల సంపదిచ్చి దీవించావు ||యేసు యేసు ||