Verse 1
యేసుక్రీస్తు అందరికి ప్రభువు - యేసే ఈలోక రక్షకుడు
యేసే సత్యదేవుడు - యేసే నిత్యజీవము
Verse 2
యేసులేని జీవితము నీరులేని ఎడారి
యేసే నీలో ఉన్న నిత్య జీవ జలనది
లోకమును వెలిగించే నీతి సూర్యుడు
పాపమును తొలగించే పరిశుద్ధుడు ||ఆ యేసుని ||
Verse 3
యేసే జగతిలో గురువులకు సద్గురువు
ప్రజాపతి ఆయనే రాజులకు రారాజు
యేసే నాయకుడు దీనులకు సన్నిహితుడు
యేసే ఉపదేశకుడు యేసే సాత్వికుడు ||ఆ యేసుని ||
Verse 4
యేసే నీ భక్తికి అర్ధము ఆధారము
యేసే నీ ముక్తికి జీవన సోపానము
యేసే నీ గమ్యము యేసే ఐశ్వర్యము
యేసే నీ భాగ్యము యేసే నీ భాగము ||ఆ యేసుని ||
Verse 5
ఆ యేసుని మదిని కోరుమా - ఆ యేసుని నేడే చేరుమా
యేసే రక్షకుడు - యేసే స్నేహితుడు