Verse 1
ఓ నేస్తమా.... నేస్తమా... యేసువైపు చూడుమా !
ఓ నేస్తమా ప్రభువైపు చూడుమా
ఓహో నేస్తమా ప్రభుచెంత చేరుమా
Verse 2
నీలములతొ నీ పునాదులు - నీలాంజనముల కట్టడము
మాణిక్యముల గుమ్మములు-సూర్యాకాంతముతొ సరిహద్దులు - 2
పర్వతాలు తొలగినను - మెట్టలు తత్తరిల్లినను - 2
వీడని కృపలో నిన్ను - నూతన గృహముగ నిర్మిస్తాడు - 2 ||ఓ నేస్తమా ||
Verse 3
విధేయులై నీ పిల్లలందరు అధిక విశ్రాంతి నొందెదరు
కీడును తలచే విరోధులు దూరమై మాయమౌతారు - 2
నీపై దూసే అయుధము ఏవిదమున వర్ధిల్లదు - 2
భీతిదూరమై నీతినిలయమై నెమ్మదికలిగి నివసిస్తావు - 2 ||ఓ నేస్తమా ||
Verse 4
ప్రయాసతో కొట్టబడి కృంగిన నిన్నుఎత్తుకుని
వాత్సల్యముతో సమకూర్చి ఆదరణతో ఓదార్చి
విజయము నీకు దయచేసే విమోచకుడు
నిను పిలుచుచున్నాడు