Verse 1
పరలోక పురమదిగో - పరిశుద్ధులతో చేరెదం - 2
చేరెదం చేరెదం కష్టాలు కన్నీళ్ళు కలతలు విడచి చేరెదం - 2 || పరలోక ||
Verse 2
పరమును విడిచి భువికేతెంచెను
పాపమునుండి పవిత్ర పరచుటకు
మరణించెను తిరిగిలేచెను - మరలా తిరిగి రానైయుండెను -2 ||పరలోక ||
Verse 3
మతములనెడివి ఎన్నిఉన్ననూ
క్రైస్తవ్యం మతము కాదని నమ్ముము
ముక్తిమార్గం - సత్యమార్గం ఇదే పరలోక మార్గం -2 ||పరలోక ||
Verse 4
ముందుగ వెళ్ళిన వారిని మనము చూచెదం
మహిమరాజుతో నిత్యం ఆనందించెదం
ఆలాపించెదం ఆనందించెదం ఆ రాజ్యంలో నిరంతరముండెదం ||పరలోక ||