Verse 1
పరిశుద్ధ అగ్నిని పంపు దేవా - నన్ను నీ అగ్నితో నింపుదేవా
Verse 2
కరుణతో అగ్నికణములను - కరగించి హృదయము తాకించును ||పరిశుద్ధ ||
Verse 3
దేశమెల్లెడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చి వేయుటకు ||పరిశుద్ధ ||
Verse 4
కన్యక వృద్దులు యౌవనులు ఉన్నత అగ్నిచే నింపబడన్ ||పరిశుద్ధ ||
Verse 5
పాపులు పశ్చాత్తాపబడన్ - శుద్ధులు మలినమున్ పోగొట్టున్ ||పరిశుద్ధ ||
Verse 6
పాపము శాపములన్నియు - భస్మమై కాలి నశించునట్లు ||పరిశుద్ధ ||
Verse 7
యేసుని ప్రేమను వెదజల్లును - విశ్వాసమునందు వర్ధిల్లను ||పరిశుద్ధ ||