Verse 1
యెహోవా ప్రభావానికి స్తోత్రంకల్గుగాకని శబ్దంవిన్నాను
యెహోవా హస్తం నా మీదికి దిగివచ్చుట చూచాను
నిత్యజీవం పొందునట్లు దుర్మార్గత వదిలేయాలని
నిత్యము ప్రజలను హెచ్చరిస్తూ ఈ సేవలో సాగిపోతున్నాను
Verse 2
వలెేని నీకృప నీ రుణము ఏమిచ్చి దాన్ని చెల్లిస్తాను
కృతజ్ఞత చెబుతాగానీ - ఖరీదు నేనివ్వలేను
నీ కనికరము నాపై ఉంది - బ్రతుకంతా లోటేముంది?
నా పని అంతటిలోనీకె మహిమ - కలకాలం భావిస్తా నా భాగ్యముగా ||యెహో ||
Verse 3
ఒకని ఆస్థి అతని సొంతమైనట్లు - నేను నీ స్వాస్థ్యమే గదా!
అమ్మకన్న బధ్రముగా నన్ను - నీవే కాపాడుకుంటావు గదా!
విలువగల నీలో కాపుదల - మహిమకై నిరీక్షనే నాకువెల
ఎన్ని చిక్కులున్నా నీ విచ్చిన కల - నెరవేర్చే నీ వుండగ భయమేల ||యెహో ||