Verse 1
నా వరుడు యేసురాజుకై - సదా నిరీక్షించెద
ఏనాడు విసుగు చెందక - ప్రభువుపై నమ్మికవిడిచి పెట్టక
కరువులు హింసలు చెరిపేటి బోధలు
మరణము అవమానము నను దూరపరచవు ||నావరుడు||
Verse 2
పత్మసులో ప్రత్యక్ష పరచిన - శాపములు భీకర విషయములు
నెరవేరినా కలత చెందక - పరలోకమే చేరిపోయెద ||నావరుడు ||
Verse 3
దేశములో ప్రబలుచుండిన - దాడులును - మత ద్వేషములును
చెలరేగినా సొమ్మసిల్లక - ప్రార్ధించుచూ పోరాడెద ||నావరుడు ||
Verse 4
సంఘములో మొలకెత్తుచుండిన - కలతలునూ - కల్లోలములునూ
బాధించినా - భీతిచెందక - విశ్వాసముతో జయము పొందెద ||నావరుడు ||