Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bedham Emi Ledu - Andarunu Papam Chesiyunnaru

బేధం ఏమి లేదు – అందరును పాపం చేసియున్నారు

Bedham Emi Ledu - Andarunu Papam Chesiyunnaru

Lyricist: John Wesley
Chorus
బేధం ఏమి లేదు! – అందరును పాపం చేసియున్నారు,
దేవాదిదేవుడు ఇచ్చే ఉన్నత మహిమను – పోగొట్టుకున్నారు‖ 2x ‖
ఏ కులమైన మతమైన జాతైన రంగైన – దేవుని దృష్టిలో అందరు పాపులే‖ 2x ‖
Verse
ఆస్తి పాస్తులు ఎన్నున్నా – నిత్యరాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా – సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయే ఈలోకము – ఆశ్రయాన్ని నీకివ్వదు
తరిగిపోయే ఈ కాలము – కలవరాన్ని తీర్చదు
నీవేవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసులేకుంటే నీకున్నవన్ని సున్న‖ 2x బేధం ‖
Verse
పుణ్యకార్యాలు చేసినా – పవిత్రత నీకు రాదుగా
తీర్ధ యాత్రలు తిరిగినా – తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు – రక్తము కార్చెను సిలువలో
కోరికోరి నిను పిలిచెను – పరమ రాజ్యము నీకివ్వగ
నీ స్థితి ఏదైనా – గతి ఏదైనా వృత్తేదైనా భ్రుతి ఏదైనా
కలువరి నాధుడే రక్షణ మార్గము‖ 2x బేధం ‖

Related Tags

GospelRepentanceSalvation