Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bethlehem Puramuna Chithrambu Kalige

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె

Bethlehem Puramuna Chithrambu Kalige

Verse
బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే
Verse
ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి‖ బేత్లేహేం ‖
Verse
పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ తొలగించివేసి
పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు‖ బేత్లేహేం ‖
Verse
నీదు చిత్తమును నాదు హృదయమున
ముదమున జేయ మదినెంతో యాశ
నీదు పాలనము పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగ జూడ‖ బేత్లేహేం ‖
Verse
దేవుని సన్నిధి దీనత నుండ
పావనయాత్మ పవిత్ర పరచున్
పావనుడేసు ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి జీవించు నెదలో‖ బేత్లేహేం ‖
Verse
గతించె రాత్రి ప్రకాశించె కాంతి
వితానముగ వికసించె నెల్ల
దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ అరుదెంచె నోహో‖ బేత్లేహేం ‖

Related Tags

ChristmasNativity