Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bethlehemu Puramulo

బేత్లెహేము పురములో

Bethlehemu Puramulo

Lyricist: Joel Kodali
Verse
బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను
అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము
రారాజు యేసు క్రీస్తుని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము
Verse
నన్నాన నా.. నా.. నా న నా న నా‖ 4x ‖
తనన్న నన్నాన నా – తనననా‖ 3x 2x ‖
Verse
ధన్యులం హీనులం మనము ధన్యులం
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో
పశువుల తొట్టెలోన నిదుర చేసెను
అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి‖ బేత్లెహేము ‖
Verse
పుట్టెను యూదులకు రాజు పుట్టెను
వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను ఆకశాన తార కనపడి
నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి‖ బేత్లెహేము ‖
Verse
దొరికెను రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్ష్యము
యేసు జన్మ నింపెను లోకమంత సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము‖ బేత్లెహేము ‖

Related Tags

WorshipChristmasNativity