Verse
బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని‖ 2x బెత్లెహేములో ‖
Verse
ఆకాశములో సందడి
చుక్కలలో సందడి‖ 2x ‖
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి‖ 2x బెత్లెహేములో ‖
Verse
దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి‖ 2x ‖
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి‖ 2x బెత్లెహేములో ‖
Verse
దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి‖ 2x ‖
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి‖ 2x బెత్లెహేములో ‖