Verse 1
మృతిని గెల్చిన విజయుడు మనయేసుడు
స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘన యేసుడు
హల్లెలూయా హల్లెలూయా - 4 || మృతిని ||
Verse 2
ఘనత నొందిన ఎందరి చరితలో
మరణముతోనే - ముగిసి పోయెను - 2
మూడవ రోజున మహిమతో లేచెను
మరణపు కోరలు త్రుంచి వేసెను ||హల్లెలూయా ||
Verse 3
మొదటి వాడుగ తానులేచెను
నమ్మిన వారిని - సయితము లేపును - 2
విశ్వాసికి బలము - యేసు విజయమే - 2
నిరీక్షణకు గురి - పునరుత్థానమే
రాకడ - నిరీక్షణ