పైలం కొడుకా పాపం చేయకురా
యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా
పైలం కొడుకా పైలం కొడుకా
పైలం కొడుకా పైలం కొడుకా
పైలం కొడుకా పాపం చేయకురా
యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా
నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా
ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది
పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది
పాపమన్నది పాములాంటిది
పగ పడ్తది ప్రాణం తీస్తది ||పైలం||
మనిషి జీవితం విలువయ్యింది
మరువకు కొడుకా మరణమున్నదని
బ్రతికింది ఇది బ్రతుకు కాదురా
సచ్చినంక అసలాట ఉంటది ||పైలం||
కత్తి కన్న పదునెక్కువ కొడుకా
మనిషి కోపము మంచిది కాదు
కాలు జారితే తీసుకోవచ్చురా
నోరు జారితే తీసుకోలేము ||పైలం||
క్రైస్తవ జీవితం విలువయ్యింది
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిందలన్ని మొయ్యాలిరా కొడుకా ||పైలం||
విచ్చలవిడిగా తిరుగుతున్నావు
ఎవరు చూడరని ఎగురుతున్నావు