Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhaaramainadhi Seva Maranamu Kanna Bhaaramaina

భారమైనది సేవ మరణము కన్న భారమైన

Bhaaramainadhi Seva Maranamu Kanna Bhaaramaina

Lyricist: Kesanapalli Abrahamu
Chorus
భారమైనది సేవ మరణము కన్న భారమైనది సేవ ఘోరనరకపు
దారి చేరి నడచెడివారిన్ జేరి వారితో సంప్రదించి ప్రభువును చూపి
ఘోరనరకపు బాధలన్నియు కూర్మితో వినజెప్పి మోక్షపు దారికిని
నడిపించి యేసుని దాపునకు నడిపించుదారి‖ దారి ‖
Verse
దురితదుర్గతి నశియించు వారినిజూచి పరితాప మొందవలయున్
మారమనసు నొంది చేరి ప్రభునితో కలిసి ఘోరపాపిని నేనని వేడి
సిలువ ధ్యానించి దురితములను చేయనని తీర్మానములను చేసికొని
రక్షింపబడినది గురుతుగ సాక్ష్యంబునిచ్చుటయే దారి‖ దారి ‖
Verse
ప్రథమ దశభాగంబుల ప్రభునకు నిచ్చి ప్రతిదినము ప్రార్థింప వలెన్
అధములగు బీదలకు నాధారముల నొసగి విధిగ భక్తుల నాదరించి
సవరించి ప్రభువు వాక్యము చదువుకొనుచు ప్రభుని పాటలు పాడుకొనుచు
ప్రభుని వేదము ప్రచురపరచి పదిలముగ జీవించకోరి
Verse
దేశదేశముల తిరిగి దేవుని వాక్యము దేశప్రజలకు చాటవలెన్
ఆశాదురాశలను కోసివేసి యేసు దాసులను జేసి వెలిగించి తిలకించి
యేసుభక్తుల పదిలపరచి యేసుతో పరిచయము చేసి యేసును ధరియింప
జేసి యేసుతో నివసించుదారి‖ దారి ‖

Related Tags

GospelEvangelismService