Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhaaratha Deshamaa Yesuke

భారత దేశమా యేసుకే

Bhaaratha Deshamaa Yesuke

Verse
భారత దేశమా యేసుకే
నా భారత దేశమా ప్రియ యేసుకే‖ 2x ‖
నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం‖ 2x ‖
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి‖ 2x ‖
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి
Verse
సృష్టికర్తనే మరచి – భారత దేశమా
సృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా‖ 2x ‖
ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమా
నిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా‖ 2x ‖
భారత దేశమా యేసుని చేరుమా
నూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా‖ 2x ‖
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి
Verse
శాంతికి అధిపతి ఆ యేసే – భారత దేశమా
శాంతి రాజ్యమును స్థాపించును – నా భారత దేశమా‖ 2x ‖
లోకమంతయు లయమైపోవును – భారత దేశమా
లోకాశలన్నియు గతించిపోవును – భారత దేశమా‖ 2x ‖
భారత దేశమా యేసుని చేరుమా
శాంతి సమాధానములను పొందుము భారత దేశమా‖ 2x ‖
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి
Verse
రాజుల రాజుగ మన యేసే – భారత దేశమా
పెండ్లి కుమారుడై రానుండె – నా భారత దేశమా‖ 2x ‖
యేసుని నమ్మిన దేశములన్ని – భారత దేశమా
యేసుతో కూడ కోనిపోబడును – భారత దేశమా‖ 2x ‖
భారత దేశమా యేసుని చేరుమా
సువర్ణ దేశముగ మార్చబడుదువు భారత దేశమా‖ 2x ‖
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి
Verse
భారత దేశమా నా యేసుకే
భారత దేశమా ప్రియ యేసుకే‖ 2x ‖
నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం‖ 2x ‖
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి‖ 2x ‖
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

Related Tags

PrayerSalvationDedicationNation