Chorus
భార్త క్రైస్తవ యువజనులారా ప్రభుకై నిలువండీ భారతరక్షక
భటవరులారా ప్రభువును జూపుటకై లెండి ఫలితము గనరండీ‖ భారత ‖
Verse
బాలప్రాయమున్ మీరలెల్ల భక్తి జీవితాసక్తిపరులై అలయోసేపును
బోలినవారై బలతర సామర్ధ్యము జూపి ఫలితముగనరండీ‖ భారత ‖
Verse
శోధనాధికము చుట్టునున్న సకల యాశలును నెట్టుచున్న బాధించుచు
మరి సాధించెడి యా సైతానుని గెలువగ లెండి ఫలితము గనరండీ‖ భారత ‖
Verse
నమ్మకంబు మదియందు బూని నేర్పుతోడ ప్రభు సేవజేయ రమ్మిదె
యేసుని రక్షణ సేవకు రాజితమగు జీవమునొందున్ ఫలితము గనరండీ‖ భారత ‖
Verse
విజయ కాంక్షగలవారలెల్ల వినయ భూషణాసక్తిపరులై నిజమగు క్రైస్తవ
నీతిని జూపి నిరతముగ వెలుగుదు రండీ నిజమిది గనుగొనుడీ‖ భారత ‖