Verse
భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా‖ భాసిల్లెను ‖
Verse
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి‖ 2x భాసిల్లెను ‖
Verse
దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం‖ 2x భాసిల్లెను ‖
Verse
పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి‖ 2x భాసిల్లెను ‖
Verse
నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో‖ 2x భాసిల్లెను ‖
Verse
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని‖ 2x భాసిల్లెను ‖
Verse
నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను‖ 2x భాసిల్లెను ‖