Verse
భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును‖ 2x ‖
వృజినములపై జయము నిచ్చిన‖ 2x ‖
విజయుడా నిను వేడుకొందు‖ భజన ‖
Verse
దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు‖ 2x ‖
భవ్యమైన బోధలెన్నో‖ 2x ‖
బాగుగా ధర నేర్పినావు‖ భజన ‖
Verse
నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు‖ 2x ‖
పరుడ నైన నా కొరకు నీ‖ 2x ‖
ప్రాణము నర్పించినావు‖ భజన ‖
Verse
చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు‖ 2x ‖
పడిన నాడు గోతి నుండి‖ 2x ‖
పైకి లేవనెత్తి నావు‖ భజన ‖
Verse
ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు‖ 2x ‖
ఇంతయని వర్ణింప నిలలో‖ 2x ‖
నెవనికిని సాధ్యంబు కాదు‖ భజన ‖