Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhajanacheyuchu Bhakthapaalaka Prasthutinthu

భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింత

Bhajanacheyuchu Bhakthapaalaka Prasthutinthu

Lyricist: Dorasami Arogyamu
Verse
భజనచేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై
జయము నిచ్చిన విజయుఁడా నిను వేఁడుకొందు‖ భజన ‖
Verse
దివ్యపదవిని విడిచి నీవు దీనుఁడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో
బాగుగా ధర నేర్పినావు‖ భజన ‖
Verse
నరులఁ గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుఁడ నైన నా
కొరకు నీ ప్రాణము నర్పించినావు‖ భజన ‖
Verse
చెడినవాఁడ నైన నన్నుఁ జేరఁదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి
పైకి లేవనెత్తి నావు‖ భజన ‖
Verse
ఎంత ప్రేమ యెంత దయ యెంత కృప యేసయ్య నీకు ఇంతయని
వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబుకాదు‖ భజన ‖

Related Tags

PraiseWorship