Chorus
భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త‖ 2x ‖
శరణు శరణు మా దేవ యెహొవా మహిమాన్విత చిర జీవనిధి
Verse
విమల సెరాపులు దూత గణంబులు చూడగలేని తేజో నిధివే
మా యఘములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే
Verse
ప్రప్రథముడ మరి కడపటి వాడా మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి
నీ భజనయే మా జీవాధారం జేకొనవే మా స్తుతి ధూపం