Verse
భక్తుల సంఘమే - ప్రభుని శరీరము
అందాయన తన - పూర్ణత నింపును
Verse
ఒక్క శరీరమునకు - శిరస్సు నొకటేగా
సంఘమునకు ప్రభువే - శిరస్సుగా
Verse
శిరస్సునుండే యోచనలు వెలువడును
శరీరము నందు - ప్రకటింప బడున్
Verse
యూదులని హెల్లే - నీయులనిలేదు
దాసులనియు స్వతం - త్రులనియు లేదు
Verse
కలవు శరీరములో - అనేకావయవముల్
కలసి ఏకముగా - నివసించుచుండున్
Verse
కరములు కాళ్ళతో - కలహించలేవు
కలయకనే కార్య-మును చేయలేవు
Verse
ఆత్మైక్యత నవ - యవములు కలిగిన
క్షేమాభివృద్ధిని - దేహము బొందున్
Verse
శిరస్సాధీనములో - సర్వాంగములుండిన
సేవలో ప్రభు పరి-పూర్ణత యుండును