Verse
భక్తులారా దుఃఖక్రాంతుడు - వచ్చె మహిమతోడ
విజయుడగాన మోక - రించుటకు పూజ్యుడు
మకుటము తలనుంచి - అభిషిక్తున్ జేయుడు - మకుటము‖ మకుటము ‖
Verse
పరలోక మార్భటింప - దూతలారా కొల్వుడి
సింహాసనమునందు రాజు - నభిషక్తున్ చేయుడి
మకుటము తలనుంచి - రాజరికమీయుడి - మకుటము‖ మకుటము ‖
Verse
పాపుల్ ముండ్ల మకుట మీయ - గరక్షితు లెల్లరు
చుట్టు నిల్చి స్తుతిపాడి - యేసు పేరుపొందుడి
మకుటము తలనుంచి - జయము ప్రకటించుడి - మకుటము‖ మకుటము ‖
Verse
యేసు మహోన్నతు డాయెన్ - హా! మహాసంతోషము
ఆర్భటించు పాట న్విని - గొప్పగా స్తుతించుడి
మకుటము తలనుంచి - డీ రాజాధిరాజుకు - మకుటము‖ మకుటము ‖