Verse
భక్తులారా స్మరియించెదము
ప్రభుచేసిన మేలులన్నిటిని
అడిగి ఊహించు వాటికన్న
మరి సర్వము చక్కగ జేసె
Verse
శ్రీయేసే మన శిరస్సై యుండి
మహాబలశూరుండు
సర్వము నిచ్చెను తన హస్తముతో
ఎంతో దయగల వాడు
Verse
గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్
Verse
జీవ నదిని ప్రవహింపజేసె
స్థలంబులయందు
లెక్కకుమించిన ఆత్మలతెచ్చె
పభువే స్తోత్రార్హుండు
Verse
అపోస్తలుల, ప్రవక్తలను
సువార్తికులను యిచ్చె
సంఘము అభివృద్ధిని
చెందుటకు సేవకులందరినెచ్చె
Verse
మన పక్షమున తానే పోరాడి
సైతానును ఓడించె
ఇంతవరకును ఆదుకొనెనుగా
తన మహాత్మ్యము జూపె
Verse
ఈ భువియందు జీవించుకాలము
బ్రతికెదము ప్రభుకొరకే
మనమాయన కర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే