Verse
భక్తులారా స్మరియించెదము
ప్రభు చేసిన మేలులన్నిటిని‖ 2x ‖
అడిగి ఊహించు వాటి కన్నా మరి‖ 2x ‖
సర్వము చక్కగ చేసె‖ 2x భక్తులారా ‖
Verse
గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే‖ 2x ‖
శ్రమలలో మనకు తోడైయుండి
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్‖ 2x భక్తులారా ‖
Verse
ఈ భువియందు జీవించు కాలం
బ్రతికెదము ప్రభు కొరకే‖ 2x ‖
మనమాయనకర్పించుకొనెదము
మనమాయనకర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే‖ 2x భక్తులారా ‖
Verse
కొంచెము కాలమే మిగిలియున్నది
ప్రభువును సంధించుటకై‖ 2x ‖
గనుక మనము నడచుకొనెదము
గనుక మనము నడచుకొనెదము
ప్రభు మార్గముల యందు‖ 2x భక్తులారా ‖