Verse
భారతదేశ సువార్త సంఘమా భువిదివి సంగమమా
ధర సాతానుని రాజ్యము కూల్చే యుద్ధ రంగమా
Verse
ఎవని పంపుదును నా తరపున ఇల ఎవరు పోవుదురు నాకై
నేనున్నను నన్ను పంపుమని రమ్మూ ఓ సంఘమా‖ 2x ‖
భారతదేశములో వెలిగే సువార్త సంఘమా
Verse
అడవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను గనుమా
అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించుని చనుమా‖ 2x ‖
భారతదేశములో వెలిగే సువార సంఘమా
Verse
బ్రతుకులోన ప్రభుశక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా
కునికిన దివ్వెలు సరిచేయ ఉజ్జీవ జ్వాలగొని చనుమా‖ 2x ‖
భారతదేశములో వెలిగే సువార సంఘమా