Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bharathadesama Yesuke

భారతదేశమా యేసుకే

Bharathadesama Yesuke

Verse 1
భారతదేశమా యేసుకే
నా భారత దేశమా ప్రియ యేసుకే‖ 2x ‖
నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధన
నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం‖ 2x ‖
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి‖ 2x ‖
భారత దేశమా నా భారతదేశమా
నా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలి
భారతదేశమా నా భారతదేశమా
ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి
Verse
సృష్టికర్తనే మరచి భారతదేశమా
సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా‖ 2x ‖
ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా
నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా‖ 2x ‖
భారతదేశమా యేసుని చేరుమా
నూతన సృష్టిగా మార్ఛబడుటకు భారతదేశమా‖ 2x ‖
Verse
శాంతికి అధిపతి ఆయనే భారతదేశమా
శాంతి రాజ్యముగ స్ధాపించును నా భారతదేశమా‖ 2x ‖
లోకమంతయు లయమైపోవును భారతదేశమా
లోకాశలన్నియు గతించిపోవును భారతదేశమా‖ 2x ‖
Verse
రాజుల రాజుల మన యేసే భారతదేశమా
పెండ్లి కుమారుడై రానుండే నా భారతదేశమా‖ 2x ‖
యేసుని నమ్మిన దేశములన్నియు భారతదేశమా
తనతోకూడా కొనిపోబడును భారతదేశమా‖ 2x ‖
భారతదేశమా యేసుని చేరుమా
సువర్ణ దేశముగా మార్ఛబడుదువు భారతదేశమా‖ 2x ‖

Related Tags

PrayerSalvationNation