Chorus
భరియించలేనేసయ్యా ఈ వేదన
సహియించలేనేసయ్యా ఈ శోధన‖ 2x ‖
ఎందాక ఈ వేదన ఎందాక ఈ శోధన‖ 2x ‖
Verse
అందరితో వెలివేయబడినా
కొందరితో దూషించబడినా‖ 2x ‖
నాకెవ్వరు ఉన్నరయ్యా నీవేనయా‖ 2x ‖
Verse
ప్రాణానికి ప్రాణమని చెప్పినా
వారెవరు నాతోడు లేరు‖ 2x ‖
నాతోడు నీవేనయా నా యేసయ్యా‖ 2x ‖
Verse
నా ప్రాణము నీవేనయా
నా సర్వము నీవేనయా‖ 2x ‖
నీవుంటే నాకు చాలయా నా యేసయ్యా‖ 2x ‖