Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhayamela Kraisthavunda Neevika Napajayama

భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమ

Bhayamela Kraisthavunda Neevika Napajayama

Lyricist: G John Tathayya
Chorus
భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేల జయ శూరుడగు
ప్రభువు యిలనీకు జయము నిచ్చుచు నుండగ‖ భయమేల ‖
Verse
భూతపీడితుల నెల్ల విడిపించుదాత మన రక్షకుండు సాతాను వల
నుండియు విడిపించిప నీతితో మనుపలేడా‖ భయమేల ‖
Verse
మరణ పాశములనుండి లాజరును కరుణతో లేపలేదా ధరణిమిమ్ముల
నూతన బలముతో గుఱికి నడిపించలేడా‖ భయమేల ‖
Verse
ద్రాక్షరసముగ నీళ్లను మార్చిన మహిమగల రక్షకుండు అక్షయ
సంతసంబు నిలమీకు దీక్షతో నివ్వలేడా‖ భయమేల ‖
Verse
ఐదు చిన్న రొట్టెలు మరి రెండు చిన్న చేపలతోడును ఐదువేల
మందిని బలపర్చినట్టి రక్షకుడుండగ‖ భయమేల ‖
Verse
విజయకరముగ బ్రతుకు ప్రభువుండు నిజవాగ్దత్తము లివ్వ నీ
వృజినము గెలువంగను ముదముతో నిజముగ నెరవేర్చడా‖ భయమేల ‖

Related Tags

FaithVictoryCourage